మొన్నటి వరకు సెంచరీ కొడుతూ పోయిన టమోటా ధరలు ఇప్పుడు నేల చూపు చూస్తున్నాయి. ఇది సామాన్యలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. కానీ ఈ రేట్లు ఎప్పుడు ఎలా ఉంటోయో తెలియక.. పెరిగినప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోంది. కానీ ఒకప్పుడు వంద.. తరువాత మెళ్లిగా 40 నుంచి 50కు దిగింది. ఇప్పుడు మరింత నేల చూపులు చూస్తోంది.
అయితే కిలో టమోట ధరలు ఎక్కువగానే ఉన్నా.. రైతులకు మాత్రం కన్నీలు తప్పడం లేదు.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చాలా ప్రాంతాల్లో కిలో టమోటా 30 రూపాయలపైనే అమ్ముతున్నారు. కానీ రైతుల దగ్గర కొనేట్టుప్పుడు రెండు రూపాయలు మాత్రమే వారికి ఇస్తున్నారు. దీంతో కనీసం దారి ఖర్చులు కూడా రావడం లేదని టమోటా రైతులు కన్నీరు కారుస్తున్నారు.