Tollywood Vs CM Jagan:సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy)తో చర్చించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. టాలీవుడ్ (Tollywood)బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)సారథ్యంలో సీఎం జగన్తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. అయితే ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. చిరంజీవితో పాటు ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఆ సమస్యలకు పరిష్కారం కోసం సీఎం జగన్ చొరవ తీసుకోవాలని సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అందులో ప్రధానమైనది ఏపీలో టిక్కెట్లు ధరల పెంచాలని కోరడం. ఇప్పటి వరకు అయితే సీఎం జగన్ ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరి పెద్దల భేటీ తరువాత మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.
అయితే జగన్ తో సమావేశానికి వెళ్లేది ఎంతమంది? ఎవరెవరు వెళతారు? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కేవలం నలుగురు నుంచి ఆరుగురి పెద్ద మనుషులు వచ్చి సమస్యను విన్నవించాల్సిందిగా ప్రభుత్వ వర్గాలు కోరినట్టు తెలుస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎవరెవరు వెళ్తారన్నది చూడాలి.
సాధరణంగా చిరంజీవితో పాటు కింగ్ నాగార్జున కూడా వెళ్లాలి.. కానీ ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 5 తెలుగుకి హోస్టింగ్ చేస్తున్నారు. ఆ షో ఆదివారం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. అంటే షూటింగ్ మొత్తం నాలుగో తేదీనే పూర్తి అవ్వాల్సి ఉంటుంది. సో నాగార్జున సీఎంతో భేటీకి వెళ్లడం కష్టమే అని ప్రచారం జరుగుతోంది.
దీంతో చిరంజీవితో పాటు వెళ్లే ఇతర హీరోలు ఎవరు అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వెంకటేష్ కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బాలయ్య వస్తే వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పొచ్చు.. దీంతో ఆ రెండు హీరో ఎవరన్నది తెలియాలి.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వారు కూడా సీఎంతో భేటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చిరూ మనసులో ఏముందో చూడాలి.
టాలీవుడ్ ప్రధాన డిమాండ్ టిక్కెట్ల రేట్లు పెంచడమే. రేట్లు పెంచకపోవడం స్టార్ల పారితోషికాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు ట్రేడ్ విశ్లేషకుల రివ్యూల అనంతరమే జగన్ టిక్కెట్టు రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. అది అనాలోచిత నిర్ణయం కాదని కూడా పలువురు ఎగ్జిబిషన్ రంగ నిపుణులు.. సీనీయర్ నిర్మాతలు విశ్లేషించారు.