బీజేపీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, టాలీవుడ్ నటి మాధవీలత ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. (Image : Facebook)
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఓ రాజకీయ నేతగా తానేంటో నిరూపించుకుంటానని ఆమె చెబుతున్నారు. (Image : Facebook)
ప్రజలకు అందుబాటులో ఉంటాననీ, మహిళలకు అండగా ఉంటాననీ మాధవీలత హామీలు ఇస్తున్నారు. (Image : Facebook)
రాజకీయాల్లోకి రాకముందు పవన్ కల్యాణ్ తరపున హైదరాబాద్లో నిరసన దీక్ష చేశారు మాధవీలత. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆమె బీజేపీలో చేరారు. (Image : Facebook)
ప్రచారంలో తనకు మంచి స్పందన వస్తుందంటున్న మాధవీలత... అది చూసిన తర్వాత తాను గెలుస్తానన్న నమ్మకం పూర్తిగా కలిగిందంటున్నారు. (Image : Facebook)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటా తిరుగుతున్న తనకు ప్రజలు ఎన్నో సమస్యలు చెబుతున్నారని మాధవీలత అన్నారు. (Image : Facebook)
డ్రైనేజీ, మంచినీరు, పెన్షన్లు వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె ప్రజలకు హామీలు ఇస్తున్నారు. (Image : Facebook)
టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ పార్టీలన్న మాధవీలత... జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడం వల్ల దేశమంతా సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. (Image : Facebook)
రాజకీయాల్లో తాను ఎక్కువకాలం కొనసాగుతానంటున్న మాధవీలత... దేశమంతా సేవలు అందించేందుకే బీజేపీలో చేరానని తెలిపారు. (Image : Facebook)