టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పృథ్వీకి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్దిరోజులు నుంచి అనారోగ్యంతో ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఆయన అన్నారు. అయితే తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని పృథ్వీ తెలిపారు. సిటి స్కాన్ వంటి పరీక్షలు కూడా చేయించుకున్నానని చెప్పారు. కొన్నిసార్లు కరోనా ఉన్నప్పటికీ నెగిటివ్ వస్తుందని వైద్యులు చెప్పారని వెల్లడించిన పృథ్వీ... వారి సూచన మేరకు క్వారంటైన్లో ఉంటున్నానని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పృథ్వీ... ఆక్సిజన్ సహాయంతో వీడియోలో మాట్లాడటం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అభిమానులు, తిరుమల శ్రీ వెంకన్న దయతో తాను తొందరగా కోలుకుంటాననే నమ్మకం ఉందని పృథ్వీ తెలిపారు.