ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమించారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినందకు సీఎం వైఎస్ జగన్ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆ సమావేశంలో టికెట్ల రేట్లు.. ఇతర సమస్య పరిష్కారానికి సీఎం జగన్ హామీలు ఇచ్చారు. అలాగే ఆయనసైతం కొన్ని డిమాండ్లను టాలీవుడ్ పెద్దల ముందు పెట్టారు.. కానీ అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. పైగా ఆ సమావేశంపై కొందరు పెదవి విరుస్తున్నారు కూడా.. టాలీవుడ్ అంటే ముగ్గురు హీరోలు, ఇద్దరు దర్శకులు కారని.. ఎవరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారంటూ విమర్శలు ఉన్నాయి.
హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.. దాదాపు 240 మందిని ఈ సమావేశం కోసం ఆహ్వానించింది ఫిల్మ్ ఛాంబర్… చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశం తర్వాత జరగనున్న ఈ కీలక సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు మా ఎన్నికల కంటే ముందు నుంచీ, ఇటీవల సీఎం జగన్ తో భేటీ.. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై ట్రోల్స్ వివాదం దాకా నిప్పు, ఉప్పుల్లా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికపైకి వస్తుండడం రానుండటం కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టుల ప్రతినిధులు హాజరవుతుండటంతో ఈ సమావేశానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
టాలీవుడ్ ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఈ కీలక సమావేశం జరుగనుంది. దీనికి 24 క్రాఫ్టులకు చెందిన సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. కరోనా విలయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్నసమస్యలు.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదుర్కొంటున్న సమస్యలు.. ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు.. ప్రభుత్వాలుజారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఫిలిం ఛాంబర్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టుడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), ఫిలిం ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అంతా కలిపి కనీసం 240 మంది ప్రతినిధులు భేటీకి హాజరవుతారని అంచనా.