శ్రీవారి భక్తులను కరోనా నుంచి కాపాడేందుకు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని.. ఎన్నో నిర్ణయాలు బోర్డు మీటింలో తీసుకున్న అమలు చేయలేక పోయామని.. దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించలేకుండా పోయామని.. గరుడ వారధి పనులు పూర్తి యలేకపోయామని.. సామాన్య భక్తులకు మెరుగైన వసతి సౌకర్యం, త్వరితగతిన శ్రీవారి దర్శనభాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని వీటిన్నింటిపైనా నేటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు చైర్మన్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
నేటి భేటిలో ముఖ్యంగా గరుడవారధిపై మరోమారు చర్చించనున్నారు. గరుడ వారధి ప్లాన్ ను అలిపిరి వరకు పెంచి.. వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేలా రీడిజైన్ చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. వరాహ స్వామి గర్భాలయ వాకిలికి 180 కేజిలతో వెండి తాపడం చేయించే ప్రతిపాదన చర్చకు రానుంది. వెండి తాపడంకు వినియోగించే వెండిని దాత విరాళంగా అందించనున్నారు.
తిరుపతి ఆలయాల్లో పుష్పకైంకర్యానికి వినియోగించే పూలతో అగరవత్తులు తయారీ ప్లాంట్ ఏర్పాటు పై సమీక్షించనున్నారు. తిరుమల భద్రత కారణాల దృష్ట్యా ఇప్పటికే రెండు దశల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్ల ఖరారు చేయనున్నారు. మూడవ దశలో 1389 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
హిందూ ధర్మప్రచారంలో భాగంగా కళ్యాణమస్తూ, ఎస్సి.. ఎస్టీ బిసి కానీలలో శ్రీవారి ఆలయ నిర్మలపై కూలంకుషంగా చర్చించనున్నారు. ఉద్యోగుల కల నెరవేర్చేలా హోసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఇంటి స్థలాలు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ ఆసుపత్రులకు ఔషదాలా కొనుగోలు, విద్యార్థులకు ఉచిత ఆహారం పై చర్చ జరపనున్నారు. గతంలో 2145 మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని ప్రభుత్వానికి పాలకమండలి తీర్మానాన్ని పంపింది... ప్రస్తుతం ఆ తీర్మానం ను వెన్నకు తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
హిందూ దేవాలయాలకు ఇచ్చే విగ్రహాలు కేటాయింపుపై సబ్సిడీ 3లక్షలకు పెంచాలనే నిర్ణయంకు ఆమోదముద్ర పడనుందని సమాచారం. టీటీడీలోని పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులను శాశ్వత పోస్టులుగా గుర్తించాలని, దీనిపై సుదీర్ఘ చర్చ జరిపి నిర్ణయం తీసుకోనున్న ధర్మకర్తల మండలి. ఏటీసీ,వరాహస్వామి అతిధి గృహం,ఉద్యోగుల కాటేజీలు ఆధునికరణ పనులు చేపట్టాలనే నిర్ణయం తీసుకోనున్నారు.
కాకులమాను కొండ దగ్గర ఉన్న విండ్ పవర్ ను 10 ఏళ్ళు పాటు ఉచితంగా మైంటైన్స్ కు గ్రీంకో ఎనరజిస్ కు కేటాయింపుకు పచ్చ జండా ఉపనున్నట్లు సమాచారం. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వడ్డపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణంపై చర్చజరిపే అవకాశం. 25ఏళ్ళు పాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఎన్టిపీసీతో ఎంవోయూ కుదుర్చుకోవడం పై చర్చ జరపనుంది.
అలాగే మొదటి ఘాట్ రోడ్డులోని 57వ మలుపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సేఫ్టీ మెష్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2.9 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పేరూరులోని వకుళమాత ఆలయం వద్ద ప్రహరీ గోడ నిర్మాణంపై చర్చ జరిపే అవకాశం. శ్రీనివాసం, విష్ణునివాసం, శ్రీవారి మెట్టు వద్ద శివశక్తీ డైరీ పార్లర్ కు దుకాణాలు ఏర్పాటు పై తుదినిర్ణయం తీసుకోనున్న టీటీడీ.
టీటీడీ పరిధిలోని నూతన అర్చకుల నియామకంపై చర్చ జరిపే అవకాశం ఉంది. రవాణా విభాగంలో పని చేస్తున్న 189 కాంట్రాక్టు సిబ్బంది పదవి కాలం ఏడాది పాటు పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు పలువురు అర్చకులు సర్వీస్ రెగ్యులరైజషన్ చేసే అవకాశంపైనా చర్చించనున్నారు. భారీగా నెయ్యి, ముడిసరుకులు కొనుగోలకు ఆమోదం వేయనున్నట్లు సమాచారం. 7ఆధ్యాత్మిక సంస్థలకు తిరుమలలో కేటాయించిన దుకాణాల కాలపరిమితి మరో 3ఏళ్ళు పాటు పొడగింపు పచ్చజండా ఉపానునట్లు తెలుస్తోంది.