TIRUPATI YSRCP MLA ROJA PLAYED KABADDI ALONG WITH HER HUSBAND SELVAMANI IN NAGARI CONSTITUENCY OF CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Roja Playing Kabaddi: భర్తకు పోటీగా బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ కోర్టులో అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా (YCP MLA RK Roja) ఏం చేసినా వినూత్నంగా ఉంటుంది. తాజాగా ఆమె తన భర్త సెల్వమణితో (Roja Husband Selvamani) కలిసి కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాది ప్రత్యేక స్థానం. తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారామె. ఇక నియోజకవర్గంలోనూ ఆమె మాటకు తిరుగులేదు.
2/ 6
నగరిలో ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగా ఉంటుంది. అందరి అటెన్షన్ ఆమెపైనే ఉంటుంది. ఇటీవల జగనన్న చీరలను తయారు చేయించిన ఆమె.. అంతకుముందు డప్పుకొట్టి సందడి చేశారు.
3/ 6
ఇక తన మాటలతో ప్రతిపక్ష పార్టీలను చెడుగుడు ఆడే రోజా... తాజాగా కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు. కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్ కు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీగా ఆడారు.
4/ 6
రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.
5/ 6
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోజా ఓ జట్టు తరపున.. సెల్వమణి మరో జట్టు తరపున కబడ్డీ ఆడారు.
6/ 6
గతంలోనూ ఓసారి రోజా కబడ్డీ ఆడారు. తన నియోజకవర్గంలో టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లి కూతపెట్టారు. అప్పుడు కూడా రోజా కబడ్డీ కోర్టులో సందడి చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.