ఈ సందర్భంగా పట్టు శాలువాతో సీఎంను రోజా సత్కరించారు. ఐతే ఆ శాలువాను చూసి సీఎం జగన్ సర్ ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ శాలువాపై సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ముద్రించి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ రంగులు, ఫ్యాన్ గుర్తులు ఉండేలా శాలువాను రూపొందించారు.