వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రాజంపేట మండలం లక్కిరెడ్డిపల్లికి చెందిన నాగేంద్ర (21) అనే యువకుడు, రుక్మిణి (35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరూ కలిసి బైక్పై నందివాళ్లపల్లె సమీపంలోని అడవికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (ప్రతీకాత్మకచిత్రం)
స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పారు. ఐతే ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధమున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందా..? లేక విడిపోయి ఉండలేక బలవన్మరణానికి పాల్పడ్డారా..? అనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)