Extramarital Affair: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..
Extramarital Affair: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..
Andhra Pradesh: భార్య ఎఫైర్ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను మందలించాడు. పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం..
1/ 6
ప్రస్తుత సమాజంలో వివాహబంధానికంటే తాత్కాలిక సుఖాలకే మొగ్గుచూపే వారు తరచూ కనిపిస్తుంటారు. అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త ఉండగానే వేరేవ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అనంతపురం జిల్లా లేపాక్షిమండలం శిరివరంకు చెందిన నారాయణప్పకు గంగదేవమ్మతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఐతే గంగదేవమ్మ పరిగి మండలానికి చెందిన ఆదెప్ప అనే వ్యక్తితే వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన నారాయణప్ప పద్దతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. అయినా ఆమె మాట వినకపోవడంతో తరచూ వేధిస్తున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో పాటు మేనల్లుడితో కలిసి స్కెచ్ వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ నెల 19న రాత్రి నిద్రిస్తున్న నారాయణప్పను ఆదెప్పతో పాటు భర్త చెల్లెలి కుమారుడితో కలిసి హత్య చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంగదేవమ్మ వివాహేతర సంబంధం విషయం తెలుసుకొని వారే చంపారని నిర్ధారించారు. గంగదేవమ్మ, ఆదెప్పతో పాటు హత్యలో పాల్గొన్న బాలుడ్ని అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)