ప్రస్తుతం దాదాపు అందరి ఇళ్లలోనూ గ్యాస్ స్టౌల మీదే వంట చేస్తున్నారు. ఇంట్లో ఉండే సభ్యులు, వినియోగాన్ని బట్టి ఒక సిలిండర్ నెల నుంచి రెండు నెలల పాటు వస్తుంది.
2/ 8
సిలిండర్ నుంచి పైప్ ద్వారా స్టౌ లోకి గ్యాస్ వస్తుంది. సిలిండర్లు ఓపెన్ చేయడంగానీ, గ్యాస్ ను కల్తీ చేయడం దాదాపు అసాధ్యం. అన్ని పరీక్షలు పూర్తైన తర్వాతే కంపెనీలు, ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ చేస్తాయి.
3/ 8
కానీ ఓ వ్యక్తి బుక్ చేసుకున్న సిలిండర్లో గ్యాస్ లేకపోగా.. నీళ్లు రావడం అందర్నీ షాక్ కు గురిచేసింది.
4/ 8
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురంకు చెందిన మనోజ్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సప్లై చేస్తున్న గ్యాస్ సిలిండర్లలో నీళ్లు రావడం కలకలం రేపింది.
5/ 8
లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ జబీయుల్లా ఇంట్లోని గ్యాస్ సిండర్ అయిపోవడంతో రీఫిల్ బుక్ చేశాడు. దీంతో స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిలిండర్ డెలివరీ చేశారు.
6/ 8
సిలిండర్ బిగించిన తర్వాత స్టౌ వెలిగించగా కాసేపటి తర్వాత మంట ఆరిపోయింది. అనుమానం వచ్చి సిలిండర్ను షేక్ చేసి చూడగా నీళ్ల సౌండ్ వంచ్చింది. దీంతో సిలిండర్ పిన్ ప్రెస్ చేసి వంచగా... నీళ్లు కారడం మొదలైంది.
7/ 8
దీంతో షాక్ తినడం జబీయుల్లా వంతైంది. ఐతే దీనిపై ఏజెన్సీని సంప్రదించగా వేరే సిలిండర్ ఇస్తామని చెప్పినట్లు జబీయుల్లా తెలిపారు.
8/ 8
ఐతే సిలిండర్లు లిక్విడ్ గ్యాస్ నింపే సమయంలో అన్ని రకాల టెస్టులు చేస్తారు. లీకేజీలేమైనా ఉన్నాయా...? సిలిండర్ బేస్ తో పాటు సైడ్ వాల్స్ సరిగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా దానిని పక్కనబెట్టేస్తారు. ఐతే సిలిండర్లోని నీళ్లు ఎలా వెళ్లాయనేది మిస్టరీగా మారింది.