ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి.. పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ స్వామి,వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతం రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, అప్పలరాజు, ఆదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వార గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కే.రోజా, బిజేపి ఎంపీ సీఎం రమేష్, సినీ డైరెక్టర్లు మారుతీ, తిరుమల కిషోర్, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతీ స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.