TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ. స్వామివారిని ఒక్కసారి అయినా దర్శించుకోవాలని.. ఆయన సేవలో పాల్గొనాలని ప్రతి భక్తులు ఆరాటపడతాడు. కానీ తిరుమలలో రద్దీ.. ఆన్ లైన్ విధానం ద్వారా చాలామందికి శ్రీవారికి దర్శన భాగ్యం కోరికగానే మిగులుతోంది. అలాంటి వారికి శ్రీవారిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది టీటీడీ.
ప్రత్యేకంగా నిలిచిన సహస్రకలశాభిషేకం:
ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు సుదీర్ఘంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. భోగశ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సేవలో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు.
నేటి సేవ..
వైభవోత్సవాల్లో భాగంగా అక్టోబరు 13న గురువారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు తిరుప్పావడ సేవ జరుగనుంది. రెండో రోజు జరిగిన వేడుకల్లో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగా చార్యులు, దాతలు శ్రీ హర్షవర్ధన్, శ్రీ ఎస్ఎస్.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.