GT Hemanth Kumar, Tirupathi, News18 Old is Gold: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన చెంత వస్తున్న కొద్దీ.. శారీరక శ్రమ తగ్గి సుఖాలకు అలవాటు పడిపోతున్నాం. మనం నిత్యం భుజితున్న ఆహారం నుంచి ధరించే వస్త్రాల వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిండి పదార్థాలు తయారీకి ఇప్పుడైతే మిక్సర్ గ్రైండర్లు, మిక్సీలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే ఇప్పుడు అసలు రుబ్బు రోలు ఎక్కడైనా దొరుకుతాయా అనుకుంటున్నారా..? తిరుపతిలోని ఈ ప్రాంతంలోకి వెళ్లాల్సిందే..? దాదాపు పదుల సంఖ్యలో కుటుంబాల ఆధారం రుబ్బు రోలు తయారీనే..?
నిత్యం ఆహారాల తయారీకి, పిండి వంటలు వండటానికి మిక్సీలు.. గ్రైండర్ లు వినియోగిస్తూ ఉంటాం. ఇంట్లోని పెద్దవాళ్ళు చెప్పే మాట మాత్రం ఒక్కటే ఆ కాలంలో రుబ్బురోలులో రుబ్బినంత రుచి రాదు అనేవారు.
తిరుపతిలోని కొర్లగుంట టిఎంసి కూడలి దగ్గర దాదాపు 25 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రుబ్బురోలు తయారీకి నల్లరాయి రకానికి చెందిన రాళ్లు మాత్రమే వాడతారు. ఒక రోలు తయారు చేయడానికి అడుగున్నర మందం ఉన్న రాయి అవసరం. ఎంత పరిమాణంలో అవసరమో అంతవరకూ సమ్మెట సాయంలో రాయిని బద్దలు కొట్టి, తర్వాత సుత్తి, ఉలి సాయంతో రాయికి ఒక ఆకారాన్ని తెస్తారు.
ఉలి కొట్టే సమయంలో సుత్తి చేతివేళ్లుకు తగిలే ప్రమాదం ఉంది. అలాగే రాయి తుంపర్లు కళ్లకు తగిలితే చూపును శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న వారికీ వచ్చే నగదు నామమాత్రమే. గ్రైండర్ ప్రవేశంలో రుబ్బు రోలు ప్రాముఖ్యత తగ్గిపోయింది. అయితే నేటికీ వివాహ వేడుకలలో వధువును తయారుచేసే సమయం లో, పసుపు కొమ్ములను రోట్లో దంచడం చూస్తుంటాం.
కాళ్లకు మెట్టెలు వేసే సమయంలో చిన్న చిన్న రుబ్బు రోళ్ల నుంచి, మసాలా బండలు, విసరలు వంటివి ఇక్కడ తాయారు చేస్తారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఇదే వృత్తిలో ఉంటూ వస్తున్నామని.. 20 కుటుంబాల వరకు ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని.. తమ పిల్లలను చదివించే స్థోమత లేదని వ్యాపారం చేస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ స్కూల్ కి వెళ్లిన 8వ తరగతితో చదువు ఆపేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. మిక్సీలు వచ్చిన అనంతరం ఆదాయం పెద్దగా లేదు. తమకు వచ్చిన డబ్బులను అక్కడ ఉంటున్న వెయ్యి కుటుంబాలు సమానంగా పంచుకుంటారు. తమకు ఉండటానికి ఇల్లు., రుబ్బురోలు తయారీకి స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటున్నారు. చంద్రబాబు హయం నుంచి తమకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం
అందలేదన్నారు. సీఎంజగన్ చేస్తారని ఆశిస్తున్నామని అని రుబ్బులోరు తయారీ దారుడు అయ్యప్ప తమ బాధనుపంచుకున్నారు.