కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala Temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనం (Tirumala Srivari Darshan) కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. సప్తగిరులు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతరద్దీగా మారాయి.
కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala Temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనం (Tirumala Srivari Darshan) కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. సప్తగిరులు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతరద్దీగా మారాయి. ఎటు చూసినా గోవింద నామస్మరణతో భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు.
2/ 7
గత నాలుగు రోజులుగో పెరిగిన రద్దీ.. మంగళవారం వారం దాదాపు రెట్టింపయింది. సర్వదర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో టీటీడీ చేతులెత్తేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
3/ 7
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టోకెన్లు దొరక్క ఇబ్బంది పడుతుండటంతో టైమ్ స్లాట్ సర్వదర్శనాన్ని రద్దు చేసిన టీటీడీ.. క్యూ లైన్ లో ఫిజికల్ వెయిటింగ్ సిస్టంను పునఃరుద్దరించింది. రెండేళ్ల తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. టోకెన్లు లేకపోయినా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
4/ 7
వాహనాల్లో వచ్చేవారితో పాటు అలిపిరి కాలినడక మార్గం నుంచి కూడా భక్తులు భారీగా తలరివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు వెలుపల కూడా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30గంటలు పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
5/ 7
ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు లో తనిఖీ చేపట్టారు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. వివిధ విభాగాధిపతులకు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు., తోపులాట జరుగకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు.
6/ 7
అనూహ్య రద్దీ కారణంగా వర్చువల్ క్యూ విధానమైన టైం స్లాట్ విధానాన్ని రద్దు చేసినట్లు ధర్మారెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగానే ఫిజికల్ వెయిటింగ్ సిస్టను పునఃప్రారంభించామని వెల్లడించిన ఆయన.. సర్వదర్శనానికి 30 గంటలు సమయం పెట్టె అవకాశం ఉందన్నారు.
7/ 7
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్యూలైన్లోని భక్తులకు ఆహారం, తాగునీరు, పాలు అందిస్తున్నామన్నారు. రద్దీ దృష్ట్యా ఈ వారం తిరుమల వచ్చేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ సూచించింది.