ఇటీవల టీటీడీ ఉచిత దర్శనానికి సబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారికి రోజుకు 2వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తోంది. ఇటీవలే ఇతర ప్రాంతాలవారికీ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించింది. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద ఈ టికెట్లను జారీ చేస్తోంది. భక్తుల ఆధార్ కార్డుల ఆధారంగా టోకెన్లు ఇస్తోంది.
ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 30వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో ప్రత్యేక దర్శనం, వర్చువల్ సేవ, శ్రీవాణి ట్రస్ట్, ప్రజాప్రతినిథుల సిఫార్సుల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. రెండు వారాల నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన వారిని రోజుకు 2వేల మంది చొప్పున ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు.