సాధారణంగా తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత ఇబ్బంది తప్పదు.. పదే పదే ఎవరినైనా అడుగుతూ వెళ్లాలి.. లేదా దళారులను నమ్మి ఆటోలకు డబ్బులు తగలేయాలి.. కానీ ఈ యాప్ మీ చేతిలో ఉంటే ఎవరి అవసరం ఉండదు..
తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేసారు. అలాగే మోబైల్ యాప్ చేతిలో ఉంటే ఇవన్నీ ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది..
భక్తులు బస్టాండ్ లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. చేతిలో మొబైల్ ఉంటే వీటిని స్కాన్ చేసి.. కావాలసిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.