తిరులమ శ్రీవారి ఆలయం (Tirumala Budget) కొత్త శోభను సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంను ఇవాళ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఏడాదిలో ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు.