వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, కరోనా వ్యాప్తి తగ్గుతుండటంతో గత రెండు నెలలుగా భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 30వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ సందర్భంగా.. ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)