ఇక చంద్రగ్రహణం కారణంగా నవంబర్ 8వ తేదీ శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8:40 నుంచి రాత్రి 7:20 గంటల వరకు మూసివేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం అర్చన, గంట, బలి శాత్తుమొర, రెండో అర్చన, గంట తదితరాలను ఏకాంతంగా చేపడతారు.రాత్రి 9 గంటల అనంతరం శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
అక్టోబర్ 25, నవంబర్ 8వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ. వయో వృద్దులు వికలాంగులు, చిన్న పిల్లల తల్లి తండ్రులు, ఎన్ఆర్ఐ, ఆర్మీ, డిఫెన్స్ ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఈ రెండు రోజుల్లో కేవలంసర్వ దర్శనంకు వచ్చిన భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.