TTD Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. రేపు డిసెంబర్ నెల ఉచిత దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా చాలామంది శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆ దర్శనం అందరికీ వీలు కుదరడం లేదు.. అయితే సామాన్యులకు సేవలను దగ్గర చేసేందుకు టీటీడీ ఇలా ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది.
ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. అందుకే వారందరూ స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే వీటిని బుక్ చేసుకోవాలని టీటీడీ విడుదల చేసింది. కేవలం డిసెంబర్ నెలకు మాత్రమే ఇందులో అందుబాటులో ఉండున్నాయి.
ఇవి బుక్ చేయాలంటే కాస్త ముందస్తు ప్రిపరేషన్ ఉంటే చాలు.. ఈ టికెట్లు పొందడానికి రైల్వేలో తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకున్నట్లుగానే ముందుగానే తిరుమల వెంకన్న ఆర్జిత సేవలను పొందొచ్చు. అదెలాగో చూద్దాం. టీటీడీ ఆన్ లైన్ టిక్కెట్లు కావాలంటే https://ttdsevaonline.com సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందు కోసం సైట్లో సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆ లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ కాగానే ఏఏ తేదీలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తూ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన తేదీని, స్లాట్ ను చెక్ చూసుకోవాలి. అందులో ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది.. ఎన్ని ఖాళీలున్నాయో చూపిస్తుంది.