Tirumala: రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబు అయింది.. సూర్య జయంతి సందర్భంగా ఒకే రోజు సప్త వాహనాలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. అందుకే రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని అంటారు.. వేకువజాము నుండి రాత్రి వరకు స్వామి వారు వివిధ వాహనాలలో దర్శనం ఇస్తారు.. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిమంది భక్తులు తిరుమల కి రానున్నారు.