గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన సకల దేవతలను టీటీడీ పండితులు సాగనంపారు. దీని కారణంగా బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని పండితులు చెబుతున్నారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారన్నది భక్తుల విశ్వాసం.
సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. తరువాత అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత అక్కడినుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్ తోటకు వేంచేశారు.