Tirumala Free Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్వదర్శనం
Tirumala Free Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్వదర్శనం
Tirumala Temple: శ్రీవారి సర్వదర్శనం కోసం చాలా రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) శుభవార్త చెప్పారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు.
2/ 8
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.
3/ 8
ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.
4/ 8
శ్రీవారి సర్వదర్శనం కోసం చాలా రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు.
5/ 8
తిరుమలలో సర్వదర్శనం పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
6/ 8
ఉన్న టైం స్లాట్లో 20%శాతం సర్వ దర్శన టోకెన్స్ జారీచేసేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు.
7/ 8
మరో మూడు రోజుల్లో సర్వదర్శనం టోకెన్స్ విడుదల చేసే అవకాశముందని టీటీడీ ఛైర్మన్ వివరించారు.
8/ 8
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున వాటిని వాటిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.