కరోనా కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేకపోతున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.
2/ 5
ఇటీవలే చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శన భాగ్యం కల్పిస్తూ రోజుకు 2వేల టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ ఉచిత దర్శనంపై కీలక ప్రకటన చేసింది.
3/ 5
వారం రోజుల్లో భక్తులందికీ శ్రీవారిని ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడి తెలిపారు.
4/ 5
ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
5/ 5
టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.., భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.