Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... నడకదారుల మూసివేత.. కారణం ఇదే..!
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... నడకదారుల మూసివేత.. కారణం ఇదే..!
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే అవకాశముండటంతో భక్తుల క్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే అవకాశముండటంతో భక్తుల క్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
నవంబర్ 17 మరియు 18 తేదీల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే రెండు నడకదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు రోజులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలకు భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో... శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటం ఇది క్రమంగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుండటంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల, తిరుపతి పూర్తిగా జలమయమైన సంగతి తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్లలో పలుచోట్ల చెట్లు కూలడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాత్రి సమయంలో ఘాట్ రోడ్లను మూసివేసే పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
కాలినడక మార్గాల్లో భారీ వర్షాల కారణంగా సెలయేర్లు ప్రవహించడంతో పాటు కొండచరియలు విరిగిపడతం, చెట్లు కూలే ప్రమాదం ఉండటంతో రెండు రోజుల పాటు నడకదారిని మూసివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)