Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ప్రత్యేక దర్శనం టికెట్లు బుకింగ్ కోటా కాసేపట్లో విడుదల..ఎలా బుక్ చేసుకోవాలంటే
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ప్రత్యేక దర్శనం టికెట్లు బుకింగ్ కోటా కాసేపట్లో విడుదల..ఎలా బుక్ చేసుకోవాలంటే
Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఫిబ్రవరి 12వ తారీఖు నుండి ఈనెల 31వ తారీఖు సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తోంది టీటీడీ. రోజు వారి ఇరవై వేల చొప్పున ఈరోజున ఉదయం 10గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
కలియుగనాథుడైన శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం లక్ష మేర భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించాలని పరితపించి పోతుంటారు. శ్రీవారి కైంకర్యాల్లో పాల్గొనాలని ప్రతి భక్తుడికి ఉంటుంది.
2/ 8
కానీ వస్తున్న రద్దీ రీత్యా అది సాధ్యం కాదు. ఇక బ్రేక్ దర్శనాలు విఐపిలు., వివిఐపిలు వారి సిపార్సుపై జారీ చేస్తుంది టీటీడీ. పరిమిత కోటాలో శ్రీవారి దర్శన భాగ్యం కొందరికే కలుగుతుంది. సామాన్య భక్తులు., ఎలాంటి సిపార్సు లేని సామాన్యులకి కేవలం సర్వదర్శనం మాత్రమే మార్గంగా ఉండేది.
3/ 8
సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనంను టీటీడీ ప్రవేశ పెట్టింది. రూ. 300ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ముందు ఆఫ్ లైన్ లో అందించిన కాలక్రమేణా ఆన్లైన్ లో విడుదల చేస్తుంది టీటీడీ.
4/ 8
ప్రతి నెల చివరి వారంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, వర్చువల్ సేవల టికెట్స్, నిత్యసేవ లక్కీ డిప్ విడుదల చేస్తుంది టీటీడీ. ప్రతి నెల 20 నుంచి 25 లోపే దర్శన టిక్కెట్ల విడుదల ప్రక్రియ రోజుకొక కోట విడుదల చేస్తూ వచ్చేది.
5/ 8
జియో క్లౌడ్ వర్చువల్ క్యూ విధానం ద్వారా సైట్ డౌన్ అవ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. ఇక ప్రతి నెల మాదిరి గానే పది రోజుల ముందే మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టోకెన్లు టిటిడి జారీ చేస్తూ వస్తుంది.
6/ 8
అయితే జనవరి 2వ తారీఖిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పచాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుండి 11వ తారీఖు వరకూ సంబంధించిన టోకెన్లను టిటిడి జారీ చేసింది.
7/ 8
అయితే 12వ తారీఖు నుండి మిగిలిన రోజుల ప్రత్యేక ప్రవేశ టోకెన్లను టిటిడి పెండింగ్ పెట్టింది. అయితే ఫిబ్రవరి 12వ తారీఖు నుండి ఈనెల 31వ తారీఖు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై వేల చొప్పున జనవరి 9వ తేది సోమవారం అనగా ఈరోజు విడుదల చేస్తోంది.
8/ 8
ఈరోజు ఉదయం 10 గంటలకు జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన స్పెషల్ దర్శనం టోకెన్లను ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in అనే వెబ్ లింక్లో టికెట్ పొందవచ్చు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.