Tirumala : తిరుమల నిజంగా ఓ అద్భుతం. అక్కడ ప్రతి రోజూ నిత్య కల్యాణం.. పచ్చ తోరణం లాగా ఉంటుంది. అందుకే చాలా మంది భక్తులు.. రాత్రివేళ తిరుమలలో ఉండేందుకు ఇష్టపడతారు. ఆ దేదీప్యమాన కాంతులు వారిలో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.