Tirumala: దేశంలోనే టాప్ టూ ప్లేస్‌కి తిరుమల ఆలయం శ్రీవారి ఆలయం .. ఎందులోనో తెలుసా..?
Tirumala: దేశంలోనే టాప్ టూ ప్లేస్‌కి తిరుమల ఆలయం శ్రీవారి ఆలయం .. ఎందులోనో తెలుసా..?
Tirumala: గడిచిన ఏడాది కాలంలో అత్యధికంగా భక్తుల దర్శించుకున్న ఆలయాల్లో తిరుమల ఏడు కొండల స్వామివారి ఆలయం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి ఆలయంగా వారణాసి ఉండగా రెండే స్థానాన్ని వైకుంఠ క్షేత్రంగా పిలవబడే తిరుమల శ్రీవారి ఆలయం చేరింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నిత్య కల్యాణం, పచ్చ తోరణం అనే నానుడి నిజమని మరోసారి నిరూపితమైంది. దేవదేవుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా ఆంక్షల తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది.(ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
గడిచిన ఏడాది కాలంలో అత్యధికంగా భక్తుల దర్శించుకున్న ఆలయాల్లో తిరుమల ఏడు కొండల స్వామివారి ఆలయం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి ఆలయంగా వారణాసి ఉండగా రెండే స్థానాన్ని వైకుంఠ క్షేత్రంగా పిలవబడే తిరుమల శ్రీవారి ఆలయం చేరింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
లాక్ డౌన్, కరోనా ఆంక్షల తర్వాత నిబంధనలు పూర్తిగా తొలగించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కోట్ల సంఖ్యలో పోటీ పడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలను భక్తులు సందర్శించిన వివరాలను ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ఆధారంగా ఈవిషయం వెల్లడైంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
ఇప్పటికే ఈఏడాదిలో తిరుమల ఆలయం అనేక రికార్డులను నెలకోల్పింది. ఏడాదిలో హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం ఒకటైతే ...భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని టీటీడీ పేర్కొంది.(ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
ప్రస్తుతానికి దేశంలో వారణాసి ఆలయం ఎక్కువ మంది భక్తులు సందర్శించిన గుడిగా మొదటి స్థానంలో నిలిచినప్పటికి తిరుమల దేవస్థానంలో పర్యాటకులు ఎక్కువగా గదులు బుక్ చేసుకున్న జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 233శాతం పెరగడం విశేషంగా చూడాలి.(ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
తిరుమల శ్రీవారి క్షేత్రం తర్వాత స్థానంలో షిర్డీలోని సాయిబాబా ఆలయం మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై ఓయో కల్చరల్ ట్రావెల్ నిర్వహించిన సర్వేలో ఈవిషయాలు వెల్లడయ్యాయి.(ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
కరోనా పరిస్థితుల నుంచి గట్టెక్కిన తర్వాత ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగింది. దాని ఫలితంగానే పర్యాటక ప్రదేశాల కంటే ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన, దర్శనీయ ప్రాంతాలకు ప్రజలు వెళ్లడం జరుగుతోంది.(ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
తిరుమల, షిర్డీ, వారణాసి తరహాలోనే ఈసంవత్సరం శబరిమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణమవుతున్నారు. స్వామి మాలాధారణ వేసుకున్న అయ్యప్పలతో పాటు సివిల్ భక్తులు సైతం శబరిమలవాసుడ్ని దర్శించుకునేందుకు టూర్లు సిద్దం చేసుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)