Tirumala Brahomtsavalu 2022: కలియుగ వైకుంఠంగా గుర్తింపు పొందిన తిరుమలలో గోవింద నామ స్మరణ దద్దరిళ్లుతోంది. అంగరంగవ వైభంగా సాగుతున్నశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు పందిరి వాహనంపై.. శ్రీ వేణుగోపాలస్వామివారి అలంకారంలో దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ వీధుల్లో వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ ప్రాంతాలకు చెందిన 17 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి. ఇందులో కర్ణాటక కనకపురాకు చెందిన పూజ-పునీత మహిళ డప్పు నృత్యం, పుదుచ్చేరికి కళాకారుల కొయ్యలాటం, మహారాష్ట్ర సోలాపుర్‌కు చెందిన లెజిమ్ పాస్క్ డ్రమ్స్, పలురకాల వాయిద్యాలతో కళాకారుల భజన భక్తులను అలరించాయి.
అదేవిధంగా, కాకినాడ మల్లెపల్లికి చెందిన మహిళలు తిన్మార్ డ్రమ్స్, తాళాలు, నృత్యం, విశాఖపట్నంకు చెందిన లలిత మహిళా భజన మండలి సభ్యులు కోలాటలు, తెలంగాణ మహబుబ్ నగర్‌కు చెందిన శ్రీ ఆంజనేయస్వామివారి భజన మండలి చెక్క భజనలు, పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన కళాకారులు లలితా లంబోదర నృత్యం, తిరుపతికి చెందిన ఎంఎంగ్రూప్ కేరళ సంప్రదాయంలో నృత్యం ఆకట్టకున్నాయి.
సింహ వాహన సేవలను కనులరా చూసిన వారికి ధైర్యసిద్ధి వస్తుందన్నది భక్తుల నమ్మకం. ముఖ్యంగా సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ పోకల అశోక్‌కుమార్, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా, తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం అఘోరా నృత్యం, భువనేశ్వరి భజన మండలి తాళాలతో చేసిన నృత్యం, అనంతపురానికి చెందిన శ్రీకృష్ణ బృందం సంప్రదాయ నృత్యం, బెంగళూరుకు చెందిన కైలాసధర బృందం నృత్యం, తిరుపతికి చెందిన ఆనందనిలయవాసా భజన మండలి నృత్య కార్యక్రమాలు అలరించాయి.