అలాంటి గుహల్లో సందడి చేస్తూ.. పార్టీ చేసుకోవాలని అందరూ ఆశ పడుతుంటారు నేటి యువత. దట్టమైన అటవీ ప్రాంతం శ్రీవారు వెలసిన పుణ్య క్షేత్రం. కపిలతీర్థానికి సమీపంలో గృహాల్లోకి వెళ్ళవచ్చు. అక్కడే కుటుంబ సభ్యులతో, మిత్రులతో, జీవిత భాగస్వామితో విందు చేసుకొనే సౌకర్యం సైతం ఉంది. అదెక్కడా అని అనుకుంటున్నారా..! తిరుపతిలోని పై వేసరాయ్ కాన్సెప్ట్ హోటల్ లో సాధ్యం అవుతుంది.
తిరుపతిలోని కపిలతీర్థం కూడలి సమీపంలో పై వేసరాయ్ హోటల్ ఉంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ కాన్సెప్ట్ మోడల్ హోటల్స్ కు ప్రసిద్ధి. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఓ కాన్సెప్ట్ వైపు వెళ్లాలని భావించిన యాజమాన్యం. గుహ కాన్సెప్ట్ హోటల్ ను ప్రజలకు పరిచయం చేసారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడూ కొండలు ఓ వైపు. గుహ లాంటి హోటల్ లో కూర్చొని డిన్నర్ చేస్తే ఆ కిక్ ఏ వేరు.
అటవీ ప్రాంతంలో వెలువడే శబ్దాలు గుహ లాంటి అట్మాస్ పియర్., రుచికరమైన ఆహారం...ఎదుట ఇష్టమైన వ్యక్తులు ఉంటె అంతక్కన్న సుఖమైమ ప్రదేశం ఏమి ఉంటుంది. గుహ లాంటి అట్మాస్ పియర్తో పాటుగా ఆదిమానవులు కాలం నాటి శిల్పాలు, కళాకృతులు హోటల్ లోని కొండల నడుమ ఏర్పాటు చేశారు. ఇక హోటల్ లోకి వెళ్లే సమయంలో చేతిలో ఈటి పట్టి.. మరో చేతిలో లాంతర్ పట్టుకున్న బొమ్మలు మరో అట్రాక్షన్.
వివిధ రకాల జంతువులు, పాములు, పక్షులు, శాలి పురుగులు, పక్షుల బొమ్మలు మనం అచ్చమైన అడవిలో ఉన్నట్లు మంచి అనుభూతి కలిగిస్తాయి. ఇక గుహలకు తగట్టుగా కౌబాయ్ డ్రెస్సులో వైటర్స్ మనకు కావాల్సిన ఆహారం అందించడం మరో ఆకర్షణ. ఇక్కడ అట్మాస్పియర్ ను చూసి... భక్తులే కాదు., స్థానికులు కూడా మంత్రం ముగ్ధులు అవుతున్నారు.
ట్రీ స్టార్ హోటల్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ వ్యక్తులు సైతం ఆనందంగా ఈ ఎస్పిరియాన్స్ పొందండి తిరుపతిలో వివిధ హోటల్స్ కన్నా తక్కువ ధరకే రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం. పాయ సూప్, బిరియాని, చెట్టినాడ్ ఐటమ్స్, బాహుబలి కబాబ్, మెంథాకు కోడి వేపుడు, కరివేపాకు రొయ్యల వేపుడు, మా స్పెషల్" న్యూస్18తో పై వేసరాయ్ గ్రూప్స్ తిరుపతి జనరల్ మేనేజర్ మదన్ మోహన్ తెలిపారు.