సాలికట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా.. సెప్టెంబరు 20వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఆలయంలో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఇందుకోసం సెప్టెంబరు 19వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబడవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ కోరింది.
బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వెంకటేశ్వర స్వామివారికి పటువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబరు 1న గరుడ సేవ జరుగనుంది.. రెండున్నరేళ్ల తరువాత.. భక్తుల మధ్య వేడుకలు నిర్వహిస్తుండడంతో.. బ్రహ్మోత్సవాల నిర్వహణను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.