కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి సేవ భాగ్యం ఓ సాధారణ టైలర్ కు లభించింది. స్వామి వారి ముందు నిలబడే పరదాలు., కురాలాలు తాయారు చేసే భాగ్యం ఆయనకు దక్కింది. నెల రోజుల పాటు దీక్ష చేసి... ఆ దీక్షలో స్వయంగా తన చేతితోనే పరదాలు., కురాలాలు తాయారు చేస్తారు. ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారికి ఈ పరదాలు., కురాలాలు అందించే భాగ్యం ఆయన సొంతం.
స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరదాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు. ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రతిమ, ఐరావతం, శంఖు చక్రాలు అమర్చారు. ఇక కుల శేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు., తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేసారు.
"చాల అరుదైన భాగ్యం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతం. తిరుపతిలో జన్మించి ఆ స్వామి వారికి సేవ చేసే విధంగా ఆ స్వామే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం శ్రీవారికి పట్టు పరదాలు సమర్పిస్తూ రావడం 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.