ఇదిలా ఉంటే తిరపతి నగరంలో ఒమిక్రాన్ కలకలం రేగింది. యూకే నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి పాజిటివ్ రావడంతో అది ఒమిక్రాన్ వేరియంట్ అనే ప్రచారం జరుగుతోంది. వైద్యులు కూడా ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక విజయనగరంలో నమోదైన ఒమిక్రాన్ కేసు విషయానికి వస్తే.. సదరు వ్యక్తి నవంబర్ 27న ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చాడు. అక్కడ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత శాంపిల్స్ ను హైదరాబాద్ సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్ గా నిర్ధారించారు. ఐతే శనివారం జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)