వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందువాటులోకి రావడమే కాదు.... వాటిని ఆచరణలో పెట్టేస్తున్నారు. రాబోయే కాలం రొబోటిక్ కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవ ప్రపంచంలో సమయం లేకుండా పరుగులు పెట్టె మానవుల... స్థానంలో రోబోలే ప్రత్యామ్నాయం అవబోతున్నాయి. ఇప్పటికే చాల ప్రాంతాల్లో మ్యాన్ పవర్ కు ప్రత్యామ్నాయంగా రోబోట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు.
రెస్టారెంట్ కు వెళ్లగానే.. డోర్ వద్దే ఓ వెయిటర్ స్వాగతం పలుకుతాడు. డైన్ టేబుల్ చూపించి టేక్ యువర్ సీట్ సార్ అంటూ.... మనం ఇచ్చే ఆర్డర్ ను స్వీకరిస్తాడు. వెంటనే మనం ఆర్డర్ చేసిన ఆహారాన్ని మన టేబుల్ వద్దకు తీసుకొస్తారు. ఇందంతా రెస్టారెంట్లలో సాధారణంగా సాగె ప్రక్రియ. తిరుపతిలో నూతనంగా 'రోబో డైనేర్ రెస్టారెంట్' ను ప్రారంభించారు నిర్వాహకులు.
‘సెన్సార్., కంట్రోలర్ రోబోట్ కాకుండా అటానమస్ రోబోలను రెస్టారెంట్స్ లో వినియోగించడం దేశంలో ఇదే ప్రధమం. రుచికరమైన వెజ్- నాన్ వెజ్ లలో ఎన్నో వెరైటీలను మా రెస్టారెంట్ లో కస్టమర్స్ కి అందిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక చెఫ్ ల ద్వారా కస్టమర్ అభిరుచులకు ఫుడ్ అందించడం మా స్పెషల్. కరోనా నుంచి మా కస్టమర్ దేవుళ్ళు దూరంగా ఉండాలనే ఈ నయాఆలోచన' అంటూ న్యూస్18 తో హోటల్ ఎండీ భారత్ కుమార్ రెడ్డి చెప్పారు.