స్వామి వారి చిత్రపటాన్ని అధికారులు రాష్ట్రపతికి అందజేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ద్రౌపతి ముర్ముకు అందజేశారు. రాష్ట్రపతితో పాటు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి సహా కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణ స్వామి, సత్యనారాయణ, రోజా, దేవాదాయ సహా ఆలయాధికారులు ఉన్నారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆ తరువాత ధ్వజస్తంభానికి మనస్కరించి ఆలయ ప్రవేశం చేశారు. అంతరాలయం లో శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవారి చిత్రపటం., తీర్థప్రసాదాలు అందజేశారు.