అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన నారా లోకేష్ ను టీటీడీ అధికారులు అదనంగా గంట పాటూ క్యూలైన్లలో వెయిట్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం కక్ష పూరితంగా లోకేష్ ను అవసరం లేకున్నా క్యూ లైన్లో వెయిట్ చేయించారని.. ఆరోపించారు టీడీపీ నేత బీ.టెక్ రవి. ఈరోజు ఉదయం ఆయన నారా లోకేష్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలో లోకేష్ కు ఉదయం 6.45 గంటలకు దర్శన రిపోర్టింగ్ టైమ్ ఇచ్చి గంట సేపు ఆలస్యం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపార్టమెంట్ లో 40 నిమిషాలు, క్యూలైన్లో మరో 20 నిమిషాలు నారా లోకేష్ ను వెయిట్ చేయించారన్నారు. దైవ దర్శనంలో కూడా ఇలాంటి అడ్డంకులు పెట్టడం దారుణమన్నారు. లోకేష్ పాదయాత్రను చూసి వైసీపీ భయపడుతోంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు.