శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అతి పవిత్రంగా భావించే కార్తీక మాసం.. దానికి తోడు నాగులు చవితి కావడంతో భక్తులు భారీగా ఈ సేవల పాల్గొన్నారు.
భారీగా చేరుకున్న భక్తుల గోవింద నామ స్మరణ మధ్య కన్నుల పండుగగా ఈ వేడుక సాగింది. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలందుకుంటున్నారు.
అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నారు.
అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఇఇ శ్రీ జగన్ మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తగినంతమంది గాయకులను కార్తీక దీపోత్సవాలకు పంపడానికి డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్తీక మాసం విశిష్టత, భక్తులు చేయాల్సిన, చేయకూడని పనులు తెలిపే కరపత్రాలు ప్రెస్ ప్రత్యేకాధికారి సిద్ధం చేయాలని జేఈవో అన్నారు. పిఆర్వో తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసి, పబ్లిసిటీ కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.