రంగురంగుల ముగ్గులతో మైదానం మొత్తం అలంకరించారు. అక్కడ తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు అట్టహాసంగా సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గోన్నారు.. సంక్రాంతి సంబరాలను పోలీస్ శాఖ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ముందస్తుగా జిల్లా పోలీస్ శాఖ తరపున వారు పోలీస్ మైదానంనందు ఘనంగా నిర్వహించారు.
ఇక్కడి వాతావరణం చూస్తే.. సంక్రాంతి సంబరాలకు ఒక గ్రామానికి వచ్చినట్లు అనిపిస్తుంది అన్నారు రోజా.. ఎటు చూసినా గంగిరెద్దులు, ఎడ్ల బండ్లు, హరిదాసులు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులు, సాంప్రదాయ దుస్తులలో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వీటినన్నిటిని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలి రోజా కోరుకున్నారు. పోలీసులు అధికారులు, సిబ్బందిలానే ప్రతి ఒక్కరు భేదాభిప్రాయం లేకుండా మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలనే సూక్తితో కల్మషం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా జీవనాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు రోజా..