Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు మంత్రి రోజా.. గతంలో తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పుడు కూడా.. పదునైన విమర్శలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీలో చేరిన తరువాత.. చంద్రబాబు నాయుడు, లోకేష్ ను విమర్శించడంలో రోజా ముందుంటారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.
ఆ ముగ్గురు నేతలే టార్గెట్ గా జబర్దస్థ్ పంచ్ లతో రోజా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ అంటారు.. అలాంటి రోజా తాజాగా తీవ్రంగా ఏమోషనల్ అయ్యారు. రోజా మంత్రి అవ్వక ముందు వరకు ఆమె ఐరెన్ లెగ్ అంటూ ప్రత్యర్లు లు విమర్శలు చేసేవారు. అయితే గతంలో ఎప్పుడూ ఈ విమర్శలపై నేరుగా ఆమె స్పందించలేదు.. కానీ తాజాగా ఆమె చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది.
రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళాదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రాస్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు వృద్దులకి దుప్పట్లు చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ ఆసక్తి కర పోస్ట్ చేశారు. ఇప్పుడెందుకు ఆమె ఈ పోస్ట్ చేశారన్నదే చర్చనీయాంశమవుతోంది.
అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అంటున్నారు.. ప్రస్తుతం రోజా సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆమెకు వెన్ను పోటు పొడుస్తున్నారు. మంత్రి అయిన తరువాత ఆ కుట్రలు మరింత పెరిగాయని.. అందుకే ఆమె ఇలా ఆవేదన వ్యక్తం చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.