Renigunta Foxlink Fire Accident: ఆపిల్ ఐఫోన్ కేబుల్స్ తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘటన
Renigunta Foxlink Fire Accident: ఆపిల్ ఐఫోన్ కేబుల్స్ తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘటన
ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా తిరుపతి జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఆపిల్ ఐఫోన్ కేబుల్స్ తయారీ చేసే ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. Hemanth,News 18, Tirumala
ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా తిరుపతి జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
2/ 7
ఈ ఫ్యాక్టరీలో ఆపిల్ ఐ ఫోన్ ల కోసం కేబుల్స్ ని తయారు చేస్తారు. పరిశ్రమలోని మొదటి అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
3/ 7
ఈ మంటల ధాటికి దట్టమైన పొగలు ఒక్కసారిగా ఫ్యాక్టరీని చుట్టిముట్టి రోడ్డును కమ్మేశాయి. దీనితో పరిశ్రమ నుంచి కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
4/ 7
డేటా కేబుల్ తయారీ పరిశ్రమ కావడంతో మంటలు అత్యంత వేగంగా వ్యాపించినట్లు తెలుస్తుంది. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి దట్టమైన పొగలు పూర్తిగా కమ్మేశాయి.
5/ 7
దీనితో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటి ఎక్కువగా ఉండడంతో క్షణాల్లోనే మొదటి అంతస్థు పూర్తిగా దగ్ధం అయింది.
6/ 7
మిగిలిన అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా వారిని రేణిగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
7/ 7
ఈ ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తి దగ్ధం అయినట్లు తెలుస్తుండగా..ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాబోయేది ఎండాకాలం కావడంతో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.