తాత్కాలిక సుఖాల కోసం వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల చాలా చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. పిల్లనిచ్చిన అత్తతోనే ఓ అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
2/ 6
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వై.రాంపురం గ్రామం వద్ద ఏప్రిల్ 28న హత్య జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.
3/ 6
కల్యాణదుర్గం గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన మహిళలో వివాహమైంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా సొంత అత్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
4/ 6
విషయం తెలిసిన మామ ఎర్రిస్వామి.. అల్లుడి కదిలికలపై నిఘాపెట్టాడు. ఈక్రమంలో గత నెల 28 మామ, అల్లుడుకి కలిసి బెళుగుప్పమండలం దుద్దెకుంటలో పెళ్లికి వెళ్లారు. వేడుక మధ్యలోనే వన్నూరుస్వామి తన అత్తదగ్గరకు వచ్చాడు.
5/ 6
అక్కడి నుంచి వన్నూరు స్వామి తిరిగి వస్తుంటగా.. అప్పటికే అక్కడ కాపుకాసిన ఎర్రిస్వామి బండిగూటంతో అల్లుడ్ని బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
6/ 6
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి ఎర్రిస్వామిని కోర్టులో హాజరుపరిచారు.