ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుమల రద్దీగా ఉండడంతో.. ఈ రథోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. స్వయంగా రథాన్ని లాగేందుకు వందలాది మంది భక్తులు పోటీ పడ్డారు. తమ కోరికలు అన్నీ తీరాలి అంటూ స్వామి వారిని మొక్కుకున్నారు. రేపటితో ఈ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మరోవైపు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ప్రత్యేక వాహన సేవలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. చిరుజల్లుల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 11 గంటల నుండి శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ మోహన్, సూపరిండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.