Tiruchanoor: భారత దేశంలో ఎక్కడ లేని విధంగా మహాలక్ష్మి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. తిరుచనూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం దంపతులు తదితరుల్లో వేడుకల్లో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు.