TTD: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ కనిపిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్నారు. అయితే రెండు రోజుల పాటు జరిగిన శ్రీ గణపతి హోమం గురువారం ఘనంగా ముగిసింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తొలి రోజు అంటే బుధవారం సైతం భారీగా భక్తులు హాజరయ్యి.. గణపతి హోమంతో ప్రారంభమయైన ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.
ఇక అక్టోబరు 31న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 1న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 2న శ్రీ నవగ్రహ హోమం, నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం), నవంబరు 12 నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం), నవంబరు 22న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు. నవంబరు 23న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల ఆరాధన నిర్వహిస్తారు.