ఈ ఆర్ట్ గీయడానికి వెదురు పుల్లను కుంచెగా తాయారు చేస్తారు. ఆ కుంచెతోనే రంగులు అద్దడం., ఆకారాలు గీయడం వంటివి చేస్తారు. ఇక చీర పూర్తి కావడానికి 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఇందులో కేవలం సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తారు. ఇలా తాయారు అయిన చీరలు అవి చిరిగిపోయి వరకు రంగులు అలానే ఉండటం విశేషం.
కలంకారీ కళ నాకు ఎన్నో అవార్డులు రివార్డులను తీసుకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం అవార్డు అందుకోవడం చాల సంతోషంగా ఉందంటున్నారు. ట్రెండ్ కు అనుగుణంగా హ్యాండ్ పౌచెస్., సెల్ ఫోన్ ప్రొటెక్టర్స్., వివిధ రకాల నగలు దాచుకొనే బాక్స్ లు., కీ చైన్స్.. ఫాన్సీ వెరబుల్స్ అన్ని తాయారు చేస్తున్నామని" న్యూస్18 తో భానోదయ కలంకారీ నిర్వాహకురాలు పద్మ చెప్పారు.