GT Hemanth Kumar, Tirupathi, News18. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుడు క్షణకాలం దర్శించుకుంటే జన్మం ధన్యమైనట్టే అని భక్తులు నమ్ముతారు.. ఆపదలో ఉన్న వారికీ ఆపద మొక్కులవాడై.. సకల పాప రక్షకుడై ఇలా వైకుంఠంలో వెలిశారు. కోర్కెలు తీర్తే కోనేటి రాయడు కనుకనే రోజుకు లక్షకు పైగా స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు. ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి.. గండం గట్టెక్కిన తరువాత అదే ముడుపులు స్వామి వారికి సమర్పిస్తారు భక్తులు.
భక్తులు తాము కోరుకున్న్టట్టే తగట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు. కరోనా మహమ్మారి మానవాళిని కబళించిన సమయంలో శ్రీవారి దర్శనాలు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ. తరువాత శ్రీవారి దర్శనాలు ప్రారంభించిన.. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న నామమాత్రంగానే హుండీ ఆదాయం లభించేది.
దీంతో ఒక ఏడాది బడ్జెట్ సైతం టీటీడీ సవరించింది. కరోనా పరిస్థితులు తొలగి మునుపటి రోజులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకంటే అధిక సంఖ్యకు భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తున్నారు. రోజుకు లక్షకుపైగా భక్తులు వస్తుంటే.. అదే స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది.