అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త దారిలోనే భార్య నడుస్తుంది. తన భర్తే సర్వస్వం అని భావిస్తుంటుంది. భర్తను కాదని పరాయి వాళ్ల గురించి కలలో కూడా ఆలోచించదు. అలా ఎన్నో ఆశలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి భర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భార్య వినకూడని మాట భర్త నోటి నుంచి వచ్చింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి తెచ్చాడా మృగాడు. (ప్రతీకాత్మక చిత్రం)
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన వ్యక్తికి 2020 మార్చి 5వ తేదీన ఓ యువతితో పెళ్లైంది. పెళ్లిన కొత్తలో బాగానే ఉన్న పోలయ్యకు కొన్నాళ్లకే భార్యపై అనుమానపు జబ్బు మొదలైంది. భార్యకు ఎవరితోనో సంబంధం ఉందంటూ నిత్యం వేధిస్తూ కొడుతూ ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల అత్తింటి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భర్త నిత్యం వికృతంగా ప్రవర్తిస్తుండటంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీతో మీ ఎస్పీ-స్పందన పేరుతో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన బాధిత యువతి.. తన భర్త, అత్తమామల చిత్రహింసల గురించి చెప్పి బోరున విలపించింది. (Photo: Facebook page Tirupati Urban Police )