కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఏడుకొండలకు తరలివస్తారు. సాధారణంగా పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో సప్తగిరులపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఐతే శనివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగింది. వైకుంఠ ఏకాదశి రోజుకంటే మించిన రద్దీ తిరుమల కొండపై నెలకొంది. (ఫైల్)
శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేయడంతో ఈ మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువవుతోంది. లక్షలాది మంది తరలివస్తుండటంతో అధికారులు కూడా చేతులెత్తేసేపరిస్థితి నెలకొంది. ఏప్రిల్ లో ఇదే విధంగా భక్తులు పోటెత్తడంతో రెండేళ్ల తర్వాత తొలిసారిగా టోకెన్ లేకుండానే దర్శనానికి అనుమతించారు.