పూర్తి స్ధాయిలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో క్రమేపి దర్శన టోకెన్ల సంఖ్యను టిటిడి పెంచడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎగబడుతున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడుతోంది.. ఎటు చూసినా భక్త సందోహంతో నిండిపోతుంది.. వారంతపు సెలవులు కావడంతో స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
శ్రీవారి దర్శనం టికెట్లకు భారీ డిమాండ్ కనిపించింది. దీంతో ఊహించని విధంగా హిట్స్ పెరిగాయి. ఈ కరణంతో సర్వర్ సమస్యతో ఇబ్బందులు తప్పలేదు. టెక్నికల్ సమస్య కారణంగా.. తాత్కాలికంగా టోకెన్ల జారీని తిరుమల నిలిపివేసింది. సాంకేతిక సమస్య కారణంగా సైట్ నిలిచిపోయింది.. అసౌకర్యాన్ని భక్తులు అర్థం చేసుకోవాలని టీటీడీ కోరింది.
శని, ఆదివారాలు కావడంతో తిరుపతి అలిపిరి ప్రాంతంలో వాహనాలు బారులు తీరాయి.. 8 లైన్లకు గాను రెండు ప్రాంతాల్లో ఉన్న 5 స్కానర్లలో రెండు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో తనిఖీలు అనంతరం తిరుమలకు వెళ్లేందుకు సుమారు గంటకు పైగ సమయం పడుతుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.